కంప్యూటర్‌ సైన్స్‌ చదివే వారికి గూగుల్‌ గుడ్‌న్యూస్‌.. 1000 డాలర్లు స్కాలర్‌షిప్‌ పొందే అవకాశం

కంప్యూటర్‌ సైన్స్‌ను కెరీర్‌గా ఎంచుకునే అమ్మాయిలకు అభ్యర్థులకు గూగుల్‌ సదావకాశం కల్పిస్తోంది.

Published : 06 Nov 2021 01:52 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కంప్యూటర్‌ సైన్స్‌ను కెరీర్‌గా ఎంచుకునే అమ్మాయిలకు అభ్యర్థులకు గూగుల్‌ సదావకాశం కల్పిస్తోంది. కంప్యూటర్‌ సైన్స్‌లో డిగ్రీ చేసే విద్యార్థినులకు జనరేషన్‌ గూగుల్‌ స్కాలర్‌షిప్‌ కార్యక్రమం కింద స్కాలర్‌షిప్‌ అందిస్తోంది. ఈ స్కాలర్‌షిప్‌నకు ఎంపికైన వారు 2022-23 విద్యా సంవత్సరానికి గానూ వెయ్యి డాలర్లు స్కాలర్‌షిప్‌ రూపంలో అందుకుంటారు.

చదువులో ప్రతిభతో పాటు వైవిధ్యం, వినూత్న ఆలోచనల ఆధారంగా ఈ స్కాలర్‌షిప్‌కు ఎంపిక చేస్తారు. అలాగే 2021-22 అకడమిక్‌ సంవత్సరంలో ఫుల్‌టైమ్‌ డిగ్రీ అభ్యసిస్తుండాలి. స్కాలర్‌షిప్‌ పూర్తయ్యేనాటికి ఏషియా, పసిఫిక్‌ దేశాలకు చెందిన గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయంలో రెండో ఏడాది డిగ్రీ చదువుతుండాలి. అర్హత కలిగిన అభ్యర్థులు తమ టెక్నికల్‌ ప్రాజెక్టులను పేర్కొంటూ రెజ్యుమె/ సీవీని రూపొందించాలి. 400 పదాలకు తగ్గకుండా ఆంగ్లంలో రాసిన వ్యాసాన్ని పంపాల్సి ఉంటుంది. డిసెంబర్‌ 10లోపు స్కాలర్‌షిప్‌ కోసం దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు గూగుల్‌ వెబ్‌సైట్‌ను సందర్శించండి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని