APPSC: మార్చి 17న గ్రూప్‌-1 పరీక్ష.. వాయిదా వదంతులు నమ్మొద్దు: గౌతమ్‌ సవాంగ్‌

ఏపీలో గ్రూప్‌-2 ప్రిలిమినరీ పరీక్ష ముగిసింది. 899 గ్రూప్‌-2 ఉద్యోగాలకు ఏపీపీఎస్సీ పరీక్ష నిర్వహించింది.

Published : 25 Feb 2024 13:56 IST

అమరావతి: ఏపీలో గ్రూప్‌-2 ప్రిలిమినరీ పరీక్ష ముగిసింది. 899 గ్రూప్‌-2 ఉద్యోగాలకు ఏపీపీఎస్సీ పరీక్ష నిర్వహించింది. పరీక్ష తీరును ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ గౌతమ్‌ సవాంగ్‌ పర్యవేక్షించారు. రాష్ట్రవ్యాప్తంగా 4.63 లక్షల మంది ఈ పరీక్ష రాశారని ఆయన తెలిపారు. ఎక్కడా మాల్‌ ప్రాక్టీస్‌ నమోదు కాలేదని చెప్పారు. ‘చిత్తూరు జిల్లాలో ఫేక్‌ అడ్మిట్‌ కార్డుతో వచ్చిన వ్యక్తిని పట్టుకున్నాం. నకిలీ హాల్‌టికెట్‌ తయారు చేసిన వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నాం. జూన్‌ లేదా జులైలో గ్రూప్‌-2 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు ఉంటాయి. మార్చి 17న గ్రూప్‌-1 పరీక్ష ఉంటుంది. వాయిదా వదంతులు నమ్మకుండా పరీక్షకు సిద్ధం కావాలి’ అని గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని