కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్‌ జయంతి

ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో చిన్న హనుమాన్‌ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.

Updated : 23 Apr 2024 11:08 IST

కొండగట్టు: ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో చిన్న హనుమాన్‌ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వేకువజాము నుంచే ఆలయంలో అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. దీక్షాపరులు స్వామి వారి సన్నిధిలో దీక్షా విరమణ చేస్తున్నారు. అర్థరాత్రి నుంచి సుమారు 50 వేల మంది దీక్షాపరులు దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు. 22న ప్రారంభమైన ఈ ఉత్సవాలు రేపటితో ముగియనున్నాయి. బుధవారం కూడా భారీ స్థాయిలో దీక్షా పరులు వచ్చి అంజన్నను దర్శించుకోనున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని