Hyderabad: హైదరాబాద్ అభివృద్ధిపై వీడియో పెట్టు.. క్యాష్ ప్రైజ్ కొట్టు
హైదరాబాద్ అభివృద్ధిపై తెలంగాణ డిజిటల్ మీడియా వింగ్ ‘హ్యాపెనింగ్ హైదరాబాద్ రీల్స్ కాంటెస్ట్’ నిర్వహిస్తోంది. ఇందుకోసం భారీగా ప్రైజ్ మనీ కూడా ప్రకటించింది.
హైదరాబాద్: మీ చేతిలో మొబైల్ ఉందా? వీడియోలు తీసే అలవాటు ఉందా? అయితే క్యాష్ ప్రైజ్ పోటీలో మీరూ పొల్గొన వచ్చు. తొమ్మిదేళ్లలో భాగ్యనగరం ఎంతో అభివృద్ధి చెందింది. నగరంలోని ఎల్బీనగర్, గచ్చిబౌలి లాంటి ప్రధాన కూడళ్ల రూపు రేఖలు పూర్తిగా మారిపోయాయి. దశాబ్దం క్రితం హైదరాబాద్ వచ్చిన వారు.. ఇప్పుడు హైదరాబాద్‌కు వస్తే కొన్ని ప్రాంతాలను చూసి గుర్తు పట్టలేరు కూడా. ఈ విషయం ఆ నోటా.. ఈ నోటా చెప్పుకోవడమే కాదు.. నగరంలో అభివృద్ధిపై ఎంత మందికి అవగాహన ఉందో తెలుసుకోవాలని సంకల్పించింది రాష్ట్ర ప్రభుత్వం.
హైదరాబాద్ అభివృద్ధిపై తెలంగాణ డిజిటల్ మీడియా వింగ్ ‘హ్యాపెనింగ్ హైదరాబాద్ రీల్స్ కాంటెస్ట్’ నిర్వహిస్తోంది. భారీగా ప్రైజ్ మనీ కూడా ప్రకటించింది. విజేతకు రూ.50,000, ఫస్ట్ రన్నరప్ రూ.25,000, సెకండ్ రన్నరప్ రూ.10,000, ముగ్గురికి కన్సొలేషన్ ప్రైజ్ రూ.5వేలు చొప్పున. ఇవ్వనున్నట్టు తెలంగాణ డిజిటల్ మీడియా ప్రకటించింది. ఇందుకోసం మీరు చేయవలసిందల్లా.. మీరు ఎంతో ఇష్టపడే హైదరాబాద్‌లో గత తొమ్మిదేళ్లలో జరిగిన అభివృధ్ధికి అద్దంపట్టే దృశ్యాలను 60 సెకన్ల నిడివి మించకుండా వీడియో తీయాలి. ఆ వీడియోను @DigitalmediaTS ట్యాగ్‌తో సోషల్ మీడియాలో పోస్టు చేయాలి. ఆ తర్వాత వీడియో లింక్‌ను dir_dm@telangana.gov.inకు మెయిల్ చేయాలి. ఏప్రిల్ 30వ తేదీతో ఈ పోటీ ముగుస్తుంది. మరిన్ని వివరాల కోసం https://it.telangana.gov.in/contest/లో చూడాలని తెలంగాణ డిజిటల్ మీడియా తెలిపింది. మే రెండో వారంలో విజేతలను ప్రకటిస్తారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
పాక్ మీడియాలో ఇమ్రాన్ కనిపించరు.. వినిపించరు
-
Ap-top-news News
9వ తేదీ వరకు పలు రైళ్ల రద్దు: విజయవాడ రైల్వే అధికారులు
-
India News
క్రికెట్ బుకీని ఫోన్‌కాల్స్‌తో పట్టించిన అమృతా ఫడణవీస్
-
India News
సోదరి కులాంతర వివాహం.. బైక్‌పై వచ్చి ఎత్తుకెళ్లిన అన్న
-
India News
సికింద్రాబాద్ - అగర్తలా రైలులో షార్ట్ సర్క్యూట్
-
Movies News
స్నేహితుల మధ్య ప్రేమ మొదలైతే..