సిద్దిపేట జిల్లాకు సాగునీరు అందించండి.. మంత్రి ఉత్తమ్‌కు హరీశ్‌రావు విజ్ఞప్తి

సిద్దిపేట జిల్లా (Siddipet News) రైతాంగ సమస్యను పరిష్కరించాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌ రెడ్డి (Uttam Kumar Reddy)కి మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) లేఖ రాశారు.

Updated : 17 Dec 2023 19:54 IST

హైదరాబాద్‌: సిద్దిపేట జిల్లా (Siddipet News) రైతాంగ సమస్యను పరిష్కరించాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌ రెడ్డి (Uttam Kumar Reddy)కి మాజీ మంత్రి హరీశ్‌రావు (Harishrao) లేఖ రాశారు. గత మూడేళ్లుగా సిద్దిపేట జిల్లా భూములకు రంగనాయక సాగర్‌ ద్వారా సాగునీరు అందజేశామని, తద్వారా పంట దిగుబడి పెరిగి రైతుల జీవితాల్లో సంతోషం నిండిందని పేర్కొన్నారు. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో యాసంగి పంటకు సరిపోయే నీరు రిజర్వాయర్‌లో లేక రైతాంగం ఆందోళనకు గురవుతోందన్నారు. యాసంగికి నీళ్లు అందించాలంటే కనీసం 3 టీఎంసీల నీరు ఉండాలి.. కానీ ప్రస్తుతం రంగనాయక సాగర్ రిజర్వాయర్‌లో 1.50 టీఎంసీల నీరు మాత్రమే ఉందని చెప్పారు. రైతాంగ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని వెంటనే మిడ్ మానేరు నుంచి 1.50 టీఎంసీల నీరు రంగనాయక సాగర్‌కు పంపింగ్ చేసేలా ఇరిగేషన్ అధికారులను ఆదేశించాలని హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు