Old Age: వృద్ధాప్యంలో వచ్చే ఇబ్బందులెన్నో..? ఈ జాగ్రత్తలు తీసుకుంటే దూరమే..!

వృద్ధాప్యం రాగానే అనారోగ్య సమస్యలెన్నో చుట్టుముడుతుంటాయి. జీవితపు ఆఖరి మజిలీలో భోజనం చేసినా సరిగా జీర్ణం కాదు. ఒళ్లు, కీళ్ల నొప్పులు, కంటి చూపు, ఒంట్లో సత్తువ లేకుండా పోవడం సాధారణ విషయమే. కొంతమందికి జ్ఞాపకశక్తి కూడా తగ్గిపోతుంది.

Published : 07 Oct 2022 01:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వృద్ధాప్యం రాగానే అనారోగ్య సమస్యలెన్నో చుట్టుముడుతుంటాయి. జీవితపు ఆఖరి మజిలీలో భోజనం చేసినా సరిగా జీర్ణం కాదు. ఒళ్లు, కీళ్ల నొప్పులు, కంటి చూపు, ఒంట్లో సత్తువ లేకుండా పోవడం సాధారణ విషయమే. కొంతమందికి జ్ఞాపకశక్తి కూడా తగ్గిపోతుంది. వృద్ధాప్యం శాపం కాదు..వరంలా భావించినట్లయితే జీవితం సాఫీగా సాగిపోతుందని సీనియర్‌ జనరల్‌ ఫిజిషియన్‌ డాక్టర్‌ ఎంవీ రావు పేర్కొన్నారు. 

ఆరోగ్య సమస్యలున్నా...

కాళ్ల నొప్పులు 60 ఏళ్లు దాటిన తర్వాత వస్తాయి. ఫిజియోథెరపీతో నొప్పులు తగ్గించుకోవచ్చు. కొంతమందికి మాత్రమే మోకీళ్ల మార్పిడి చేయించుకోవాల్సి వస్తుంది. బీఎండీ పరీక్ష చేయించుకొని మందులు వాడితే ఎముకలు బాగుంటాయి. జ్ఞాపక శక్తి తగ్గిపోవడం సాధారణ అంశమే. దాన్ని సీరియస్‌గా తీసుకోవద్దు. మానసికంగా దృఢంగా ఉండేందుకు యోగా, మెడిటేషన్‌ చేస్తే బాగుంటుంది. సంగీతం, పుణ్యక్షేత్రాలకు వెళ్లడం, పుస్తకాలు చదవడంతో పాటు తమ వయసు ఉన్న వారితో కలిసి మాట్లాడాలి. కంటి చూపు సరిగా లేనపుడు కంటి వైద్యులను కలుసుకోవాలి. గ్లకోమా ఉంటే ఆపరేషన్‌ చేయించుకోవాలి.  చెవి వినికిడి లోపించినపుడు అవసరమైతే మిషన్‌ పెట్టుకోవాలి. 

వీటిని తినండి....

వృద్ధాప్యంలో ఎక్కువగా ఆకు, కాయగూరలను తినాలి. పీచు ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి. మలబద్దకం , మూత్ర సంబంధ సమస్యలు ఉంటాయి. ఈ సమస్యలకు మంచి మందులున్నాయి. వైద్యులను కలుసుకుంటే ఇబ్బందులను అధిగమించవచ్చు. మధుమేహం, బీపీ ఉంటే ఆహారంలో మార్పులు చేసుకొని వైద్యుల సూచనలతో మందులను వాడాలి. గుండె సంబంధమైన సమస్యలుంటే వైద్యులను తరచుగా సంప్రదించాలి. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని