AP High court: 62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది

ఏపీలో వాలంటీర్ల రాజీనామాల పిటిషన్‌పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది.

Updated : 24 Apr 2024 15:57 IST

అమరావతి: ఏపీలో వాలంటీర్ల రాజీనామాల పిటిషన్‌పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఎన్నికలు ముగిసే వరకు రాజీనామాలను ఆమోదించవద్దని భారత చైతన్య యువజన పార్టీ (BCY) పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్‌ పిటిషన్‌లో కోరారు. ఇప్పటి వరకు 62వేల మంది రాజీనామా చేశారని, 900 మందిపై చర్యలు తీసుకున్నామని ఎన్నికల కమిషన్ తరఫు సీనియర్ న్యాయవాది అవినాష్ దేశాయ్  కోర్టుకు తెలిపారు. వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచామని చెప్పారు. రాజీనామాలు ఆమోదిస్తే వారంతా వైకాపాకు అనుకూలంగా ఉంటారని పిటిషనర్‌ తరఫు న్యాయవాది ఉమేశ్‌చంద్ర వాదించారు. ఆర్టికల్‌ 324 ప్రకారం ఈసీకి విస్తృత అధికారాలు ఉన్నాయని, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిపేందుకు ఆ అధికారాలు వినియోగించవచ్చని తెలిపారు. పిటిషనర్‌ వాదనలపై కౌంటరు దాఖలు చేయాలని ఈసీని ఆదేశిస్తూ తదుపరి విచారణను హైకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని