TS High Court: మహిళలకు ఉచిత ప్రయాణంపై పిటిషన్‌.. హైకోర్టులో విచారణ

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది.

Published : 31 Jan 2024 16:36 IST

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. నాగోల్‌కు చెందిన హరిందర్ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఉచిత ప్రయాణం వల్ల బస్సుల్లో రద్దీ పెరిగిందని, కుటుంబంతో కలిసి వెళ్తే బస్సుల్లో కనీసం నిలబడే పరిస్థితి కూడా లేదని కోర్టు దృష్టికి తెచ్చారు. ఉచిత ప్రయాణం కల్పిస్తూ జారీ చేసిన జీవో 47ను రద్దు చేయాలని కోరారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం.. ఈ వ్యాజ్యంలో ప్రజాప్రయోజనం లేదని పేర్కొంది. ఇబ్బంది ఎదుర్కోవడం వల్లే పిటిషన్‌ దాఖలు చేశారని అభిప్రాయ పడింది. పిల్‌ను రిట్ పిటిషన్‌గా మార్చాలని రిజిస్ట్రీని ఆదేశించిన కోర్టు.. తదుపరి విచారణను వాయిదా వేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని