AP High Court: ఐఆర్‌ఆర్‌ కేసు.. చంద్రబాబు పిటిషన్‌పై విచారణ వాయిదా

రాజధాని ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు (ఐఆర్‌ఆర్‌) కేసులో తెదేపా అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది.

Updated : 29 Nov 2023 14:48 IST

అమరావతి: రాజధాని ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు (ఐఆర్‌ఆర్‌) కేసులో తెదేపా అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఐఆర్‌ఆర్‌ మాస్టర్‌ ప్లాన్‌లో అవకతవకలు జరిగాయంటూ సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ఇప్పటికే చంద్రబాబు తరఫున సీనియర్‌ న్యాయవాది నాగముత్తు వాదనలు వినిపించారు. తదుపరి విచారణను డిసెంబర్‌ 1కి ఉన్నత న్యాయస్థానం వాయిదా వేసింది. 

మరోవైపు అసైన్డ్ భూముల వ్యవహారంలో తెదేపా నేత, మాజీ మంత్రి నారాయణ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో నారాయణ దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌, క్వాష్‌ పిటిషన్లపై విచారణను ఉన్నత న్యాయస్థానం డిసెంబర్‌ 11కి వాయిదా వేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని