MLC kavitha: కవిత బెయిల్‌ పిటిషన్లపై వాదనలు సోమవారానికి వాయిదా

భారాస ఎమ్మెల్సీ కవిత బెయిల్‌ పిటిషన్లపై దిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. బెయిల్‌పై మే 27న కౌంటర్ దాఖలు చేస్తామని సీబీఐ తెలిపింది.

Updated : 24 May 2024 14:16 IST

దిల్లీ : దిల్లీ మద్యం కేసులో అరెస్టయిన భారాస ఎమ్మెల్సీ కవిత బెయిల్‌ పిటిషన్లపై దిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. బెయిల్‌పై మే 27న కౌంటర్ దాఖలు చేస్తామని సీబీఐ తెలిపింది. జూన్ 7న  ఛార్జిషీట్‌ దాఖలు చేయనున్నట్లు కోర్టుకు వెల్లడించింది. మరోవైపు కవిత బెయిల్ పిటిషన్‌పై ఈడీ కౌంటర్ దాఖలు చేసింది. ఈ కేసులో వాదనలు వినిపించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ఈడీ తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు.

కవిత బెయిల్ పిటిషన్‌పై వాదనలను కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. ఈడీ అరెస్టు చేసిన విధానం, కేసులో కవిత పాత్ర గురించి దర్యాప్తు సంస్థ చెప్పిన విషయాలపై కోర్టుకు కవిత తరఫు న్యాయవాది వివరించారు. ఆదివారం సాయంత్రం లోపు కౌంటర్ కాపీని కవిత న్యాయవాదికి మెయిల్ ద్వారా ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. సోమవారం రెండు కేసుల్లో కవిత తరఫు వాదనలు పూర్తి చేయాలని సూచించింది. మంగళవారం ఈడీ, సీబీఐ వాదనలు వింటామని న్యాయమూర్తి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు