Pinnelli: జూన్‌ 6వరకు పిన్నెల్లిపై చర్యలు తీసుకోవద్దు: హైకోర్టు

జూన్‌ 6వ తేదీ వరకు మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఏపీ హైకోర్టు ఆదేశించింది.

Updated : 23 May 2024 22:11 IST

అమరావతి: జూన్‌ 6వ తేదీ వరకు మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఏపీ హైకోర్టు ఆదేశించింది. పోలింగ్‌ రోజు ఈవీఎంను ధ్వంసం చేసిన కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న పిన్నెల్లి గురువారం ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం పిన్నెల్లి సహా ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల ముందస్తు బెయిల్‌ పిటిషన్లపై ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా హైకోర్టు కొన్ని షరతులు విధించింది. పిటిషనర్లు దర్యాప్తును, సాక్షులను ప్రభావితం చేయకూడదని ఉత్తర్వుల్లో పేర్కొంది.

పోలింగ్‌ రోజు వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రెంటచింతల మండలం పాల్వాయిగేట్‌ పోలింగ్‌ కేంద్రంలో ఈవీఎం, వీవీప్యాట్‌లను ధ్వంసం చేసిన ఘటనపై ఈసీ తీవ్రంగా స్పందించింది. ఐపీసీ, ప్రజాప్రాతినిధ్య చట్టం, పీడీపీపీ చట్టాల పరిధిలో  10 సెక్షన్లతో పిన్నెల్లిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఐపీసీ కింద 143, 147, 448, 427, 353, 452, 120బి, ఆర్పీ చట్టం 131, 135 సెక్షన్లతో కేసులు నమోదయ్యాయి. పిన్నెల్లి విదేశాలకు పారిపోయేందుకు యత్నిస్తున్నట్లు అనుమానించిన పోలీసులు అన్ని ఎయిర్‌పోర్టులను   అప్రమత్తం చేసి లుకౌట్‌ నోటీసులు జారీ చేశారు. పల్నాడు ఎస్పీ నేతృత్వంలో 8 పోలీసు బృందాలు గాలింపు చేపట్టాయి. ఈ నేపథ్యంలో గురువారం పిన్నెల్లి హైకోర్టులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు