AP High Court: ఏయూలో అవినీతిపై పిటిషన్‌.. విచారణ 8 వారాల పాటు వాయిదా

ఆంధ్రా యూనివర్సిటీ (ఏయూ)లో నిధుల మళ్లింపు, అవినీతిపై దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది.

Published : 29 Nov 2023 13:09 IST

అమరావతి: ఆంధ్రా యూనివర్సిటీ (ఏయూ)లో నిధుల మళ్లింపు, అవినీతిపై దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. గవర్నర్‌ తీసుకునే నిర్ణయం మేరకు తదుపరి విచారణ చేపడతామని హైకోర్టు తెలిపింది. అనంతరం తదుపరి విచారణను 8 వారాల పాటు వాయిదా వేసింది. 

ఏయూ మాజీ వీసీ పీవీజీడీ ప్రసాదరెడ్డి తన పదవీకాలంలో ఏపీ విశ్వవిద్యాలయాల చట్టం, యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా పలు నియామకాలు చేపట్టారని ఆరోపిస్తూ ఇటీవల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అలుమ్ని అసోసియేషన్‌ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. నోటిఫికేషన్‌ లేకుండా వీసీ ప్రసాదరెడ్డి పోస్టుల భర్తీ చేశారని.. వర్సిటీల పరిధిలో ఉన్న కళాశాలల్లో అక్రమ నియామకాలు చేపట్టారని పిటిషన్‌లో పేర్కొంది. అలాగే ఆయా వివరాలతో కూడిన వినతిపత్రాన్ని గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌కు కూడా సంఘం ప్రతినిధులు పంపారు. 

వీసీగా ప్రసాదరెడ్డి పదవీ కాలం ఈ నెల 24న ముగిసింది. నాలుగేళ్ల తన పదవీకాలంలో ఆయన తీసుకున్న అనేక నిర్ణయాలు వివాదాస్పదమయ్యాయి. ఆయన తీసుకున్న అడ్డగోలు నిర్ణయాల వల్ల పలువురు సీనియర్‌ ప్రొఫెసర్లు తమ అవకాశాలు కోల్పోయారని అలుమ్ని అసోసియేషన్‌ ఆరోపించింది. ప్రసాదరెడ్డిపై లోకాయుక్త లేదా హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించేలా రాష్ట్ర ప్రభుతాన్ని ఆదేశించాలని గవర్నర్‌కు పంపిన వినతిపత్రంలో కోరింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు