Srisailam Temple: శ్రీశైలంలో భక్తులకు చుక్కలు చూపించిన ట్రాఫిక్‌

ద్వాదశ జ్యోతిర్లంగ క్షేత్రమైన శ్రీశైలం ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది.

Updated : 19 May 2024 18:53 IST

శ్రీశైలం: ద్వాదశ జ్యోతిర్లంగ క్షేత్రమైన శ్రీశైలం ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం, వేసవి సెలవులు కావడంతో తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి పోటెత్తారు. ఆన్‌లైన్‌ ద్వారా టికెట్లు పొందిన భక్తులు శ్రీమల్లికార్జున స్వామి వారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన పూజలు నిర్వహించారు. సాధారణ భక్తులు స్వామివారి దర్శనం చేసుకొని మొక్కులు తీర్చుకుంటున్నారు.

భక్తుల రద్దీ పెరగడంతో టోల్‌గేట్‌ మలుపు వద్ద ట్రాఫిక్‌ సమస్య ఏర్పడింది. పెద్ద ఎత్తున వచ్చిన వాహనాలు శివపార్వతుల విగ్రహాల వద్ద నిలిపివేయడంతో ఆలయానికి వచ్చి తిరిగి వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రద్దీ రోజుల్లో ట్రాఫిక్ సమస్యను చక్కదిద్దడంతోపాటు, సమస్యలు తలెత్తకుండా దేవస్థానం అధికారులు చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు