Andhra news: రాష్ట్రంలోని 130 మండలాల్లో వడగాల్పులు: విపత్తు నిర్వహణ సంస్థ

రాష్ట్రంలోని పలు మండలాల్లో గురువారం తీవ్ర వడగాల్పులు వీచే అవకాశముందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది. 

Updated : 03 Apr 2024 22:19 IST

అమరావతి:  రాష్ట్రంలోని పలు మండలాల్లో గురువారం తీవ్ర వడగాల్పులు వీచే అవకాశముందన ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది. గురువారం వివిధ జిల్లాల్లోని 130 మండలాల్లో వడగాల్పులు వీస్తాయని పేర్కొంది. శ్రీకాకుళం జిల్లాలో 4, విజయవనగరం జిల్లాలో 19, పార్వతీపురం మన్యం 12, అల్లూరి సీతారామరాజు 4, అనకాపల్లి 13, కాకినాడ 9, తూర్పుగోదావరి 3, కృష్ణా 1, ఎన్టీఆర్ 14, గుంటూరు 5, పల్నాడు 6, నంద్యాల 19, అనంతపురం 1, వైఎస్సార్ కడప జిల్లాలో 20 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం  ఉందని తెలిపింది. కడప జిల్లా ఒంటిమిట్టలో ఇవాళ 43.4డిగ్రీలు, అనంతపురం జిల్లా తెరన్నపల్లి, ప్రకాశం జిల్లా దరిమడుగు, నంద్యాల జిల్లా బ్రాహ్మణ కొట్కూరులో 43.3 డిగ్రీలు, కర్నూలు జిల్లా లద్దగిరిలో 43.2 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.  కడపజిల్లా వీరాపునాయుని మండలంలో తీవ్రవడగాల్పులు, 59 మండలాల్లో వడగాల్పులు వీచాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని