Tirumala: మాండౌస్‌ ప్రభావంతో తిరుమలలో భారీ వర్షాలు.. గరిష్ఠ స్థాయికి జలాశయాలు

మాండౌస్‌ తుపాను ప్రభావంతో తిరుమలలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు శ్రీవారి కొండ తడిసి ముద్దయింది. కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో భక్తుల రాకపోకలను తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) నిలిపివేసింది.

Updated : 10 Dec 2022 18:01 IST

తిరుమల: మాండౌస్‌ తుపాను ప్రభావంతో తిరుమలలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు శ్రీవారి కొండ తడిసి ముద్దయింది. కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో భక్తుల రాకపోకలను తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) నిలిపివేసింది. పాపవినాశనం, శిలాతోరణం మార్గాలను తితిదే మూసివేసింది. భారీ స్థాయిలో కురుస్తోన్న వర్షాలకు తిరుమలలోని అన్ని జలాశయాలు గరిష్ఠ స్థాయికి చేరుకుంటున్నాయి. తిరుమలలోని ఏఎన్‌సీ ప్రాంతంలో భారీ వృక్షం విరిగిపడడంతో అక్కడే విధులు నిర్వహిస్తోన్న పారిశుద్ధ్య కార్మికురాలు స్వల్పంగా గాయపడ్డారు. ఆమెను వెంటనే అశ్విని ఆస్పత్రికి తరలించారు. వృక్షాన్ని తొలగించేందుకు తితిదే అధికారులు చర్యలు తీసుకున్నారు.  శ్రీవారి మెట్టు మార్గం గుండా తిరుమలకు నడిచి వెళ్లే భక్తులను తితిదే అనుమతించడంలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని