AP High Court: ఏబీవీ సస్పెన్షన్‌ రద్దు నిలిపివేత పిటిషన్‌పై తీర్పు రిజర్వు

సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ రద్దు నిలిపివేత పిటిషన్‌పై ఏపీ హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది.

Updated : 23 May 2024 22:32 IST

అమరావతి: సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ను రద్దు చేస్తూ క్యాట్‌ ఇచ్చిన ఉత్తర్వులపై ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. ఇరువైపులా వాదనలు ముగియగా.. న్యాయస్థానం తీర్పును రిజర్వు చేసింది. ఒకే అభియోగంపై రెండు సార్లు సస్పెండ్ చేయటం చట్ట విరుద్ధమని క్యాట్ తెలిపిందని ఏబీ వెంకటేశ్వరరావు తరఫు న్యాయవాది వాదించారు. నిబంధనలకు వ్యతిరేకంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. పోస్టింగ్ ఇవ్వకుండా వేధిస్తోందని కోర్టుకు తెలిపారు. పోస్టింగ్ ఇవ్వకుండా ఉండేందుకే ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిందన్నారు. సస్పెన్షన్‌ ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీచేయడంలో క్యాట్‌ పొరపాటుపడిందని ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదించారు. సస్పెన్షన్‌కు తగిన కారణాలు ఉన్నాయన్న విషయాన్ని క్యాట్‌ పరిగణనలోకి తీసుకోలేదన్నారు. వివిధ హైకోర్టులు ఇచ్చిన తీర్పులకు కట్టుబడి వ్యవహరించడంలో క్యాట్‌ విఫలమైందన్నారు. క్యాట్‌ ఉత్తర్వులు హేతుబద్ధంగా లేవన్నారు. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వు చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు