Immunity Booster: పోపుల పెట్టె వైద్యం!

ప్రస్తుతం కరోనా మహమ్మారి గుప్పిట ప్రపంచమంతా కొట్టుమిట్టాడుతోంది. వేరియంట్లు, మ్యుటేషన్లు ఏవైనా..

Updated : 13 May 2021 17:08 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రస్తుతం కరోనా మహమ్మారి గుప్పిట ప్రపంచమంతా కొట్టుమిట్టాడుతోంది. వేరియంట్లు, మ్యూటేషన్లు ఏవైనా ప్రభావం చూపడానికి ప్రధాన కారణం రోగనిరోధక శక్తి తగ్గడం. వివిధ రకాల ట్యాబ్లెట్లు, ఇంజక్షన్లు, వ్యాక్సిన్లతో ఇమ్యూనిటీ పెంచుకునే అవకాశం ఇప్పుడు ఉంది. అయితే వంటింట్లోనే రోగ నిరోధక శక్తిని పెంచుకుని కరోనాను దూరం చేసే మందులు ఉన్నాయని మీకు తెలుసా..? ఈ వైరస్‌కు పోపుల పెట్టె వైద్యమే సరైందని నిపుణులు అంటున్నారు.

మందులు, వ్యాక్సిన్లతో ఇమ్యూనిటీ వస్తుందన్నది ఎంత వాస్తవమో.. మంచి ఆహారంతో కూడా పెంచుకోవచ్చనేది అక్షర సత్యం. మరి దివ్యౌషధం లాంటి ఆహారంలో ఏమేమి ఉండాలి..? ధనియాలు, ఆవాలు ఎక్కువగా తీసుకుంటే కలిగే లాభాలు ఏమిటి? వంటి విషయాలను ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ జీవీ పూర్ణచంద్‌ వివరించారు. 

* పోపుల పెట్టెలో ఆవాలు, జీలకర్ర, కందిపప్పు, సెనగపప్పు, మిరియాలు, మిరపకాయ తదితర సుగంధ ద్రవ్యాలు ఉంటాయి. చింతపండు రసం, మసాలాలు అతిగా వాడకుండా ఉంటే జీర్ణశక్తి బాగుంటుంది.

* వాము, ఆవాల పొడి, మెంతులు, ధనియాల పొడిని తరచూ వినియోగించడం వల్ల జీర్ణశక్తి, ఇమ్యూనిటీ బూస్టర్స్‌గా పనికొస్తాయి.

* కరోనా అన్ని లక్షణాలపైనా అడ్డసరం మూలిక బాగా పని చేస్తుంది.

* పాలలో అశ్వగంధ చూర్ణం వేసుకుని తాగడం చాలా మంచిది. తులసితో జలుబు, దగ్గు, కఫం మటుమాయవుతాయి.

* పుదీనాలోని ఔషధ గుణాలతో జీర్ణకోశం సురక్షితంగా ఉంటుంది. జీర్ణశక్తిని పాడు చేసే ఆహార పదార్థాలు తీసుకోకూడదు. 

* కరోనా వల్ల ఊపిరితిత్తులకు వచ్చే లక్షణాలపై వాసరిష్ట, దసములారిష్ట, కనకాసనం, ద్రాక్షరిష్ట మందులు చాలా బాగా పనిచేస్తాయి.

* సుదర్శన (నేలవాము) అనే మొక్క యాంటీవైరల్‌, యాంటీ బ్యాక్టీరియాగా అద్భుతంగా పని చేస్తుంది. కరోనా కాలంలో మజ్జిగ, పెరుగు పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. పరిమితంగా అల్లం, వెల్లుల్లి వాడుకోవాలి.

* అల్లం, సైంధవ లవణం కలిపి నూరిన మిశ్రమాన్ని భోజనంలో మొదటి ముద్దగా తింటే శరీరంలో ఇమ్యూనిటీ పెరుగుతుంది.

* వేడిపాలల్లో పసుపు, బెల్లం తాగాలి. నీళ్లల్లో వాము, ధనియాల పొడి వేసుకుని తాగితే జీర్ణశక్తి బాగుంటుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని