Cash Seized: ఎన్నికల వేళ.. తెలుగు రాష్ట్రాల్లో భారీగా నగదు స్వాధీనం

ప్రకాశం జిల్లా ఒంగోలులో టాస్క్‌ఫోర్స్‌ తనిఖీల్లో భాగంగా భారీ మొత్తంలో నగదు పట్టుబడింది.

Updated : 21 Mar 2024 15:08 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా ఒంగోలులో టాస్క్‌ఫోర్స్‌ తనిఖీల్లో భాగంగా భారీ మొత్తంలో నగదు పట్టుబడింది. ఒంగోలు బైపాస్‌ రోడ్‌ వద్ద కారులో వస్తున్న వారి నుంచి దాదాపు రూ.24 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. సరైన పత్రాలు లేకపోవడంతో నగదును అధికారులు సీజ్ చేశారు. సత్యసాయి జిల్లా హిందూపురం ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పదంగా బస్టాండ్‌లోకి వెళ్తున్న వ్యక్తిని తనిఖీ చేయగా.. అతని చేతిలో ఉన్న కవర్‌లో రూ.8.20 లక్షలను గుర్తించారు.

తెలంగాణలోని మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌ పరిధిలో పోలీసులు వాహనాలు తనిఖీలు చేపట్టారు. ఎలాంటి పత్రాలు లేకపోవడంతో ఓ వాహనంలోని రూ.37 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నగదును జిల్లా ఎన్నికల అధికారికి అప్పగించారు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురం చెక్‌పోస్టు వద్ద 3.3 లక్షలు పట్టుబడ్డాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు