AB Venkateswara Rao: జగన్ ప్రభుత్వ కక్ష సాధింపులు.. ఏబీవీకి ప్రజల నుంచి విశేష మద్దతు
గత ఐదేళ్లుగా జగన్ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు బలైపోయిన డీజీ ర్యాంకు సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు (ఏబీవీ) (AB Venkateswara Rao)కు పౌరసమాజం నుంచి విశేష మద్దతు లభిస్తోంది
అమరావతి: గత ఐదేళ్లుగా జగన్ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు బలైపోయిన డీజీ ర్యాంకు సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు (ఏబీవీ) (AB Venkateswara Rao)కు పౌరసమాజం నుంచి విశేష మద్దతు లభిస్తోంది. #JusticeForABV పేరిట ఈ ఉద్యమం కొనసాగుతోంది. ఏబీవీకి న్యాయం జరిగేలా చూడాలని రాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రధానికి విజ్ఞప్తి చేస్తూ వేలాది మంది సంతకాలు చేస్తున్నారు. ఆన్లైన్లో శనివారం మధ్యాహ్నం నుంచి ప్రారంభమైన సంతకాల సేకరణకు ‘ఛేంజ్.ఓఆర్జీ’లో చక్కటి స్పందన లభిస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ ఎంతో మంది ఆయనకు అండగా నిలుస్తున్నారు. ఏబీవీకి న్యాయం చేయాలంటూ పోస్టులు పెడుతున్నారు.
‘‘1989 బ్యాచ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై జరుగుతున్న కుటిల, కుట్ర రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ గళం విప్పాల్సిన సమయం ఆసన్నమైంది. గత అయిదేళ్లుగా ప్రభుత్వం ఆయనకు పోస్టింగు ఇవ్వలేదు. ఆయన పదవీ విరమణకు మరో 13 రోజులే ఉంది. అయినా ఇప్పటికీ విధుల్లోకి తీసుకోవట్లేదు. సుదీర్ఘ కాలం పాటు పోలీసు శాఖకు సేవలందించిన ఏబీవీ లాంటి ఐపీఎస్ అధికారికి గౌరవప్రదంగా పదవీ విరమణ చేసే హక్కు కూడా లేకుండా చేస్తుండటాన్ని ప్రతి ఒక్కరూ ప్రశ్నించాలి. ఆయన్ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి’’ అంటూ ఏబీ వెంకటేశ్వరరావుకు మద్దతుగా ఆన్లైన్లో ఉద్యమం కొనసాగుతోంది.
పోస్టింగ్ ఇవ్వకుండానే పదవీ విరమణ చేయించే దురుద్దేశం
ప్రభుత్వమే ఫ్యాక్షనిస్టుగా మారితే... గిట్టనివారిని ఏ స్థాయిలో వేధిస్తుందో, ఎంతలా కక్ష సాధిస్తుందో ఏబీ వెంకటేశ్వరరావు ఉదంతమే తిరుగులేని ఉదాహరణ. గత ఐదేళ్లుగా ఏబీవీకి పోస్టింగ్ ఇవ్వకుండా, సస్పెన్షన్ల మీద సస్పెన్షన్లు విధించి, అక్రమ కేసులతో ఇబ్బంది పెట్టిన జగన్ ప్రభుత్వం, వైకాపా వీరభక్త అధికారగణం ఆయనపై ఇప్పటికీ అదే ధోరణి కొనసాగిస్తున్నాయి. ఏబీవీ సస్పెన్షన్ చెల్లదని, ఆయన్ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ (క్యాట్) ఆదేశాలిచ్చి పది రోజులైనా ఇప్పటివరకూ ఆయన్ను విధుల్లోకి తీసుకోలేదు. ఈ నెలాఖరున ఏబీవీ పదవీవిరమణ చేయనున్నారు. అప్పటివరకూ తాత్సారం చేసి ఆయన్ను విధుల్లోకి తీసుకోకుండానే పదవీ విరమణ చేయించాలనే ఎత్తుగడ దీని వెనక ఉందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం.. బాధితుడిని కాపాడిన మంత్రి లోకేశ్
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం గడుపుతున్న వీరేంద్ర కుమార్‌ను మంత్రి నారా లోకేశ్ కాపాడారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
బీమా సొమ్ము.. జీవితకాలం లేటు!
గుంటూరు నగర శివారులో పని చేసిన ప్రధానోపాధ్యాయుడొకరు రెండేళ్ల క్రితం స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశారు. తనకు రావాల్సిన ప్రభుత్వ జీవిత బీమా (ఏపీజీఎల్ఐ) సొమ్ము కోసం ఏడాదిన్నర క్రితం దరఖాస్తు చేసుకున్నారు -
విమాన గోపురం.. సువర్ణశోభితం
అన్నవరం సత్యదేవుని ప్రధాన ఆలయంపైన ఉండే విమాన గోపురానికి బంగారు తాపడం చేయించేందుకు మరో కీలక అడుగుపడింది. దీనికి సంబంధించిన అంచనాలు సిద్ధం చేసేందుకు తితిదే సాంకేతిక బృందం నేడు ఇక్కడకు రానుంది. -
విశాఖ ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత అందరిదీ
‘విశాఖపట్నం ప్రకృతి అందాలకు నిలయం. ఇక్కడ కొండలు, గుట్టలు, నదులు, సముద్రం అన్నీ భగవత్ ప్రసాదాలే. -
అసలే పేదరికం.. ఆపై వైకల్యం
విధి వక్రించి ప్రమాదానికి గురయ్యాడు.. ప్రాణాలతో బయటపడినా చికిత్స కోసం అప్పులు చేయాల్సి వచ్చింది.. వైకల్యం బారిన పడటంతో పని చేయలేని స్థితి. -
అంధ బాలికపై అమానుషం.. వెల్లువెత్తిన నిరసన
అంధ బాలికపై అమానుషం ఘటనలో నిందితుడిని మలక్‌పేట ఠాణా పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/07/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
జేడీ వాన్స్ వ్యాఖ్యలు వైరల్.. తీవ్రంగా ఖండించిన ప్రముఖ నటి
-
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్‌పై స్కై వ్యాఖ్యలు
-
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం.. బాధితుడిని కాపాడిన మంత్రి లోకేశ్
-
అగ్నిపథ్ పథకంపై విపక్షాల విమర్శలు.. ఖండించిన మోదీ
-
మెక్సికన్ డ్రగ్ లార్డ్ ఇస్మాయిల్ ‘ఎల్ మాయో’ జంబాడ అరెస్ట్
-
26 మంది హత్య.. మృతదేహాలను నదిలోకి ఈడ్చుకెళ్లిన మొసళ్లు..!