Hyderabad Metro: ప్రైవేటు ఆస్తుల సేకరణ సాధ్యమైనంత వరకు తగ్గించండి: ఎన్వీఎస్‌ రెడ్డి

హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టు మెట్రో అలైన్‌మెంట్‌ పనులను ఆ సంస్థ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి పరిశీలించారు. అధికారులకు తగిన సూచనలు చేశారు. 

Published : 29 Jan 2023 23:59 IST

హైదరాబాద్‌: ప్రైవేటు ఆస్తుల సేకరణను సాధ్యమైనంతవరకు తగ్గించే విధంగా ఎయిర్‌పోర్టు మెట్రో అలైన్‌మెంట్‌ ఖరారు చేయాలని హైదరాబాద్‌ ఎయిర్‌ పోర్టు మెట్రో ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి వెల్లడించారు. ఎయిర్‌పోర్టు మెట్రో అలైన్‌మెంట్‌ (Airport Metro alignment) ను ఇంజినీర్లతో కలిసి ఎన్వీఎస్‌ రెడ్డి పరిశీలించారు. నార్సింగి నుంచి రాజేంద్రనగర్‌ గుట్ట వరకు 10 కి.మీ నడిచి అలైన్‌మెంట్‌ పరిశీలించారు. స్టేషన్లకు సులువుగా చేరుకోవడం కోసం ఓఆర్‌ఆర్‌ అండర్‌ పాస్‌లను ఉపయోగించేందుకు వీలుగా స్టేషన్లను నిర్ణయించాలని ఎండీ వెల్లడించారు. భవిష్యత్తులో అదనపు స్టేషన్ల నిర్మాణం కోసం గుర్తించిన ప్రదేశాల్లో మెట్రో వయాడక్ట్‌ను ప్లాన్‌ చేయాలన్నారు. స్కైవాక్‌లు, ఇతర పాదచారుల సౌకర్యాలు స్టేషన్‌ ప్లానింగ్‌లో అంతర్భాగంగా ఉండాలని, మెట్రో పిల్లర్లు నానక్‌రామ్‌ గూడ జంక్షన్‌ నుంచి అప్పా వరకు విస్తరించిన సర్వీసు రోడ్డు సెంట్రల్‌ మీడియన్‌లో ఉండాలన్నారు. స్టేషన్ల యాక్సెస్‌ పాయింట్లు కొత్త సైకిల్‌ ట్రాక్‌కు అనుగుణంగా ఉండాలని, పర్యావరణహితంగా స్టేషన్‌లను చేరుకోవడానికి ఈ కొత్త సైకిల్‌ ట్రాక్‌ ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని