Hyderabad Metro Rail: హైదరాబాద్‌ మెట్రో రైలు సమయంలో స్వల్ప మార్పు!

హైదరాబాద్‌ మెట్రో రైలు సమయంలో మార్పు జరిగింది.

Published : 24 May 2024 19:21 IST

Hyderabad Metro Rail | హైదరాబాద్‌: మెట్రో రైలు ప్రయాణ వేళల్లో స్వల్ప మార్పు చోటుచేసుకుంది. ప్రతి శుక్రవారం రాత్రి 11.45గంటల వరకు సర్వీసు పొడిగిస్తున్నట్లు మెట్రో రైలు అధికారులు వెల్లడించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల్లో ఒక పోస్ట్‌ పెట్టారు. ప్రతి శుక్రవారం రాత్రి 11.45 గంటల వరకు, ప్రతి సోమవారం ఉదయం 5.30 గంటల నుంచే రైళ్ల రాకపోకలు నిర్వహించేలా ఇటీవల అధికారులు ట్రయల్‌ నిర్వహిస్తున్నట్లు చెప్పిన విషయం తెలిసిందే. ప్రయాణికుల రద్దీ, రైళ్లు, ట్రాక్‌ నిర్వహణ సాధ్యాసాధ్యాలను బట్టి నిర్ణయం తీసుకుంటామన్న అధికారులు.. తాజాగా శుక్రవారాల్లో రాత్రి 11.45గంటల వరకు సర్వీసును పొడిగిస్తున్నట్లు పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని