Telangana News: తాగునీటి సరఫరా పర్యవేక్షణకు 10 మంది ఐఏఎస్‌లు

తెలంగాణలో తాగునీటి సరఫరా పర్యవేక్షణకు ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది.

Published : 03 Apr 2024 15:55 IST

హైదరాబాద్‌: తెలంగాణలో తాగునీటి సరఫరా పర్యవేక్షణకు ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. 33 జిల్లాలకు 10 మంది ఐఏఎస్‌లను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో తాగునీటి సరఫరా సజావుగా జరిగేలా చూడాలని ఆదేశించింది. జులై చివరి వరకు ఈ ప్రత్యేక అధికారులు సెలవు పెట్టకూడదని ఉత్తర్వుల్లో పేర్కొంది. రాష్ట్రంలో గత ఆరు నెలల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులతో పాటు ప్రస్తుత ఎండల తీవ్రత కారణంగా జలాశయాలు, భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. ప్రధాన జలాశయాల్లో నీటిమట్టాలు తాగు అవసరాలకు మినహా సాగుకు ఎంతమాత్రం నీటిని ఇవ్వలేని పరిస్థితి (డెడ్‌ స్టోరేజి)కి చేరాయి. భూగర్భ జలమట్టాలు సైతం గత పదేళ్లలో ఎన్నడూ లేనిస్థాయిలో పడిపోయాయి. ఈ నేపథ్యంలో నీటి వృథాను అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు