Volunteers: వాలంటీర్లతో పింఛన్లు పంపిణీ చేయించొద్దు: ఈసీ

ఎన్నికల వేళ ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది.

Updated : 30 Mar 2024 20:09 IST

అమరావతి: ఎన్నికల వేళ ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. పింఛన్ల పంపిణీ నుంచి వాలంటీర్లను పక్కన పెట్టింది. వారితో నగదు పంపిణీ చేయించవద్దని సీఈవో ముకేశ్‌ కుమార్‌మీనా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. ఎన్నికల కోడ్‌ ముగిసే వరకు వాలంటీర్లకు ఇచ్చిన ట్యాబ్‌, మొబైల్‌ డిపాజిట్‌ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నగదు పంపిణీ పథకాల్లో ప్రభుత్వ ఉద్యోగులను వినియోగించుకోవాలని సూచించారు.

నగదు పంపిణీలో వాలంటీర్ల పాత్ర లేకుండా చూడాలని మాజీ ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ నేతృత్వంలోని ‘‘సిటిజన్‌ ఫర్‌ డెమోక్రసీ’’ (సీఎఫ్‌డీ) హైకోర్టులో పిటిషన్‌ వేసిన సంగతి తెలిసిందే. సీఎఫ్‌డీ ఫిర్యాదును కూడా పరిగణనలోకి తీసుకున్నామని ఈసీఐ తెలిపింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని