Railways: 8 రైళ్లకు అదనపు స్టాపులు.. కాకినాడకు ప్రత్యేక రైళ్లు

South central railways: ప్రయాణికుల సౌకర్యార్థం ఎనిమిది రైళ్లకు అదనపు స్టాప్‌లను దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. మరికొన్ని ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. పూర్తి వివరాలివే..

Published : 22 Aug 2023 20:09 IST

సికింద్రాబాద్‌: దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఎనిమిది ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు అదనపు స్టాప్‌లను ఏర్పాటు చేసింది. ప్రయాణికుల సౌకర్యార్థం ప్రస్తుతం సర్వీసులందిస్తున్న స్టేషన్లకు తోడు అదనంగా ఒక స్టేషన్లో ఆయా రైళ్లను నిలిపేలా చర్యలు చేపట్టింది. అయితే, ప్రయోగాత్మకంగా ఆరు నెలల పాటు ఎనిమిది ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఇకపై అదనంగా కేటాయించిన స్టేషన్లలోనూ ఆగుతాయని పేర్కొంది. అలాగే, ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని పలు స్టేషన్ల మధ్య ప్రత్యేక రైళ్ల సర్వీసులను ఏర్పాటు చేసింది.

ఆగస్టు 23 నుంచి ఎస్‌ఎస్‌ఎస్‌ హుబ్బళ్లి- హైదరాబాద్‌-ఎస్‌ఎస్‌ఎస్‌ హుబ్బళ్లి మధ్య సర్వీసులందించే రైళ్లు (17319, 17320) హోత్గి స్టేషన్‌లో ఆగనున్నాయి. అలాగే, విశాఖ నుంచి ముంబయి ఎల్‌టీటీ- విశాఖ(18519, 18520) మధ్య; కాకినాడ-ముంబయి-కాకినాడ(17221, 17222) మధ్య  రాకపోకలు సాగించే ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు  కల్యాణ్‌ స్టేషన్‌లోనూ ఇకపై ఆగుతాయి. వీటితో పాటు  ఆగస్టు 24 నుంచి విశాఖ - శిర్డీ- విశాఖ మధ్య వారానికి ఒకరోజు సర్వీసులందించే రైళ్లను (18503, 18504) కోపర్‌గాన్‌లో స్టేషన్‌లోనూ కాసేపు ఆపుతారు.

కాకినాడకు ప్రత్యేక రైళ్లు..

ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని కాకినాడ టౌన్‌ -లింగంపల్లి-కాకినాడ టౌన్‌ మధ్య ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. సెప్టెంబర్‌ 1 నుంచి 14 వరకు ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. సోమ, బుధ, శుక్రవారాల్లో కాకినాడ నుంచి రాత్రి 20.10గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 9.15గంటలకు లింగంపల్లి చేరుకోనుంది. అలాగే, మంగళ, గురు, శనివారాల్లో సాయంత్రం 6.25గంటలకు లింగంపల్లిలో బయల్దేరి మరుసటి రోజు ఉదయం 7.10గంలకు కాకినాడకు చేరుకుంటుంది. ఈ రైలు సామర్లకోట, రాజమహేంద్రవరం, తణుకు, భీమవరం టౌన్‌, ఆకివీడు, కైకలూరు, గుడివాడ జంక్షన్‌, విజయవాడ జంక్షన్‌, గుంటూరు జంక్షన్‌, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, మిర్యాలగూడ, నల్గొండ, సికింద్రాబాద్‌ స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగిస్తుందని పేర్కొన్నారు. ఏసీ 2 టైర్‌, ఏసీ 3 టైర్‌తో పాటు స్లీపర్‌, జనరల్‌ సెకెండ్‌ క్లాస్‌ కోచ్‌లు ఉంటాయి. 

ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని 20 ప్రత్యేక రైళ్ల సేవల్ని పొడిగిస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ఆ రైళ్లకు సంబంధించిన పూర్తి వివరాలివే..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని