TS Inter Exams: తెలంగాణలో ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం

తెలంగాణలో ఇంటర్‌ పరీక్షలు (TS Inter Exams) ప్రారంభమయ్యాయి. నేటి నుంచి మార్చి 19 వరకు ఇవి జరగనున్నాయి.

Updated : 28 Feb 2024 09:29 IST

హైదరాబాద్‌: తెలంగాణలో ఇంటర్‌ పరీక్షలు (TS Inter Exams) ప్రారంభమయ్యాయి. నేటి నుంచి మార్చి 19 వరకు ఇవి జరగనున్నాయి. మొదటి, రెండో సంవత్సరాలకు కలిపి 9,80,978 మంది పరీక్ష రాయనున్నారు. మొదటి సంవత్సరంలో 4,78,718, రెండో సంవత్సరంలో 5,02,260 మంది హాజరుకానున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,521 కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. పరీక్షలను ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నారు. నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు. ఎవరైనా కాపీ కొట్టినా.. ఒక వ్యక్తికి బదులు మరో వ్యక్తి పరీక్ష రాసినా క్రిమినల్‌ కేసు నమోదు చేయనున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమల్లో ఉండనుంది. విద్యార్థులు ఆయా కేంద్రాలకు చేరుకునేందుకు వీలుగా టీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. 

రోడ్డు ప్రమాదంలో ఇంటర్ విద్యార్థికి గాయాలు

ఇంటర్‌ పరీక్షలకు వెళ్తున్న విద్యార్థి రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. ఈ ఘటన ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నేరడిగొండ మండలం వడూర్‌ గ్రామానికి చెందిన విష్ణువర్ధన్‌ (17) ఇంటర్‌ ఫస్టియర్‌ చదువుతున్నాడు. పరీక్ష రాసేందుకు బుధవారం ఉదయం బైక్‌పై ఇచ్చోడకు బయల్దేరాడు. మార్గమధ్యంలో హైవేపై బస్సు నిలిపి ఉండటంతో వెనుక నుంచి బైక్‌ ఢీకొట్టింది. దీంతో విద్యార్థి తలకు బలమైన గాయమైంది. స్థానికులు 108కు సమాచారం ఇవ్వడంతో ఇచ్చోడ పీహెచ్‌సీనిక తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ఆదిలాబాద్‌ రిమ్స్‌కు తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని