AP News: ఏపీలో ఆస్తి పన్ను బకాయిలపై వడ్డీ మాఫీ!

ఆంధ్రప్రదేశ్‌లో 2023 - 2024 వరకు ఆస్తి పన్ను బకాయిలపై వడ్డీని మాఫీ చేస్తూ పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 

Published : 29 Feb 2024 22:01 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో 2023 - 2024 వరకు ఆస్తి పన్ను బకాయిలపై వడ్డీని మాఫీ చేస్తూ పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఒకే విడత కింద వడ్డీ మాఫీ చేస్తున్నట్లు ఆదేశాలు ఇచ్చింది. 2024 మార్చి 31 లోపు పన్ను ఒకేసారి లేదా వాయిదాల్లో చెల్లిస్తేనే వడ్డీ మాఫీ వర్తిస్తుందని పేర్కొంది. గతంలో వడ్డీ చెల్లించి ఉంటే పన్నులో సర్దుబాటు చేస్తామని స్పష్టం చేసింది. కొవిడ్‌ వేళ ఇబ్బందులపై క్రెడాయ్‌ వంటి అసోసియేషన్ల విజ్ఞప్తుల మేరకు వడ్డీ మాఫీ చేస్తున్నట్లు పురపాలక ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని