Exams: మూతపడిన పాఠశాల పేరుతో హాల్‌టికెట్లు.. పరీక్షకు విద్యార్థుల ఆలస్యం

ఉరవకొండలో మూతపడిన పాఠశాల పేరుతో హాల్‌టికెట్లు జారీ చేయడం గందరగోళానికి దారి తీసింది.

Published : 29 May 2024 12:33 IST

అనంతపురం: ఉరవకొండలో మూతపడిన పాఠశాల పేరుతో హాల్‌టికెట్లు జారీ చేయడం గందరగోళానికి దారి తీసింది. హాల్‌టికెట్లలో పదో తరగతి సప్లిమెంటరీ పరీక్ష కేంద్రాన్ని తప్పుగా నమోదు చేశారు. దీంతో విద్యార్థులకు ఉరవకొండ ఇందిరా కాలనీలో ఎంత వెతికినా ఆ కేంద్రం కనిపించలేదు. ఇక్కడి పాఠశాలను యాజమాన్యం మరోచోటికి మార్చడంతో పాటు పేరును కూడా మార్చేసింది. దీంతో విద్యార్థులు పరీక్ష కేంద్రానికి చేరుకునే లోపు సమయం దాటిపోయింది. ఈక్రమంలో అధికారులు పరీక్షకు అనుమతి లేదని తేల్చిచెప్పారు.  ల్లిదండ్రులు ఆందోళన చేపట్టడంతో విద్యార్థులను పరీక్ష గదిలోకి అనుమతించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు