Kaleshwaram: కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ

కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై ప్రజల నుంచి జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ ఫిర్యాదులు, నివేదనలు కోరింది.

Published : 25 Apr 2024 19:08 IST

హైదరాబాద్‌: కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై  ప్రజల నుంచి జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ ఫిర్యాదులు, నివేదనలు కోరింది. ఈ మేరకు నీటిపారుదలశాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా బహిరంగ ప్రకటన జారీ చేశారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించిన అంశాలపై కమిషన్‌కు సాక్ష్యాధారాలతో అఫిడవిట్లు సమర్పించవచ్చని తెలిపారు. బీఆర్కే భవన్‌ వద్ద ఏర్పాటు చేసిన పెట్టెలో ఫిర్యాదులు, నివేదనలు దాఖలు చేసేందుకు మే 31 వరకు గడువు ఇచ్చారు. పోస్టు ద్వారా కూడా ఫిర్యాదులు పంపేందుకు అవకాశం కల్పించారు. తగిన సాక్ష్యాలు, ప్రమాణ పత్రంలేని అఫిడవిట్లు తిరస్కరణకు గురవుతాయని స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు