Andhra News: ఐటీ కలకలం.. ఏపీ మంత్రి జయరామ్‌కు నోటీసులు

ఏపీలో ఐటీశాఖ నోటీసులు కలకలం రేపాయి. రాష్ట్ర కార్మికశాఖ మంత్రి గుమ్మనూరి జయరాం, ఆయన  భార్య రేణుకమ్మ, ఆలూరు సబ్‌రిజిస్ట్రార్‌కు ఐటీశాఖ నోటీసులు జారీ చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Updated : 01 Dec 2022 20:43 IST

కర్నూలు: ఏపీలో ఐటీశాఖ నోటీసులు కలకలం రేపాయి. రాష్ట్ర కార్మికశాఖ మంత్రి గుమ్మనూరి జయరాం, ఆయన భార్య రేణుకమ్మతో పాటు, ఆలూరు సబ్‌ రిజిస్ట్రార్‌కు  ఐటీశాఖ నోటీసులు జారీ చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రేణుకమ్మ పేరుతో ఆస్పరి మండలం చిన్నహోతురు, ఆస్పరిలో 30.83 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. వాటికి సంబంధించి ఐటీశాఖ అక్టోబరు 30న మంత్రి జయరాం, రేణుకమ్మ, ఆలూరు సబ్‌రిజిస్ట్రార్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ భూమి కొనుగోలు చేసేందుకు మంత్రి జయరాం డబ్బులు చెల్లించారని ఐటీ అధికారులు నోటీసులో పేర్కొన్నారు. 30.83 ఎకరాల భూమికి రూ.52.42లక్షలు చెల్లించారని, దీన్ని బినామీగా పేర్కొన్నారు. నోటీసులు అందుకున్న 90 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని అందులో పేర్కొన్నారు.

ఎలాంటి నోటీసులు అందలేదు: జయరాం

తమకు ఎలాంటి ఐటీ నోటీసులు అందలేదని మంత్రి జయరాం తెలిపారు. ఆలూరులోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... కొన్ని ఛానెళ్లు తనపై బురదజల్లే ప్రయత్నం చేయడం దురదృష్టకరమన్నారు. తమది ఉమ్మడికుటుంబమని, 1995లో తన తల్లి సర్పంచ్‌గా, 2006లో తాను జడ్పీటీసీగా పనిచేశామన్నారు. 2009లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశానని, 2014, 2019లో ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రిని అయ్యానని చెప్పారు. ఉమ్మడి కుటుంబంలో ఉన్న తాము 30 ఎకరాల భూమి కొనుగోలు చేశామని వెల్లడించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని