MLAs Bribery Case: నన్ను అక్రమంగా ఇరికించారు.. హైకోర్టులో జగ్గుస్వామి క్వాష్‌ పిటిషన్‌

ఎమ్మెల్యేలకు ఎర కేసుకు సంబంధించి కేరళకు చెందిన జగ్గుస్వామి తెలంగాణ హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. తనకు సిట్‌ జారీ చేసిన 41-ఎ సీఆర్‌పీసీ, లుకౌట్‌ నోటీసులపై స్టే ఇవ్వాలని పిటిషన్‌లో కోరారు.

Published : 03 Dec 2022 11:26 IST

హైదరబాద్: ఎమ్మెల్యేలకు ఎర కేసుకు సంబంధించి కేరళకు చెందిన జగ్గుస్వామి తెలంగాణ హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. తనకు తెలంగాణ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) జారీ చేసిన 41-ఎ సీఆర్‌పీసీ నోటీసులు, లుకౌట్‌ నోటీసులపై స్టే ఇవ్వాలని పిటిషన్‌లో కోరారు. ఎమ్మెల్యేలకు ఎర కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, అక్రమంగా ఈ కేసులో ఇరికించారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ హైకోర్టులో సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఈ కేసులో పోలీసులు జగ్గుస్వామికి సంబంధించిన కీలక ఆధారాలు సేకరించారు. తుషార్, రామచంద్రభారతికి జగ్గుస్వామి మధ్యవర్తిగా వ్యవహరించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని