TSPSC ఛైర్మన్‌ రాజీనామా.. సీఎం రేవంత్‌ను కలిసిన కాసేపట్లోనే..!

టీఎస్‌పీఎస్సీ (TSPSC) ఛైర్మన్‌ పదవికి జనార్దన్‌ రెడ్డి (Janardhan Reddy) రాజీనామా చేశారు. సీఎం రేవంత్ రెడ్డి కలిసిన కొద్దిసేపట్లోనే ఆయన తన పదవికి రాజీనామా చేశారు.

Updated : 12 Dec 2023 11:19 IST

హైదరాబాద్‌: టీఎస్‌పీఎస్సీ (TSPSC) ఛైర్మన్‌ పదవికి జనార్దన్‌ రెడ్డి (Janardhan Reddy) రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన కొద్దిసేపటికే ఛైర్మన్‌ పదవికి ఆయన రాజీనామా చేయడం గమనార్హం. రాజీనామాకు ముందు బోర్టుకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఆ తర్వాత గవర్నర్‌ తమిళిసైకి జనార్దన్‌ రెడ్డి రాజీనామా సమర్పించారు. దాన్ని గవర్నర్‌ ఆమోదించాల్సి ఉంది. 

కాగా, 2021 మే నెలలో TSPSC ఛైర్మన్‌గా జనార్దన్‌ రెడ్డి నియమితులయ్యారు. ఇటీవల టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌ - 1 పేపర్‌ లీకేజీ, పలు పరీక్షల నిర్వహణకు సంబంధించిన అంశాలపై టీఎస్‌పీఎస్సీపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. కమిషన్‌ను ప్రక్షాళన చేయాలని, ఛైర్మన్‌ పదవికి జనార్దన్‌ రెడ్డి రాజీనామా చేయాలనే డిమాండ్లు సైతం వినిపించిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని