MLC Kavitha: సీబీఐ కస్టడీకి ఎమ్మెల్సీ కవిత.. రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు

దిల్లీ మద్యం కేసులో కవితను (Kavitha) కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై రౌస్ అవెన్యూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

Updated : 12 Apr 2024 16:51 IST

దిల్లీ: దిల్లీ మద్యం కేసులో కవితను (Kavitha) కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై రౌస్ అవెన్యూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలని సీబీఐ కోరగా.. 3 రోజుల పాటు (ఈనెల 14 వరకు) కస్టడీకి అనుమతిస్తూ  ఆదేశాలు జారీ చేసింది. కోర్టు తీర్పు నేపథ్యంలో కవితను సీబీఐ కేంద్ర కార్యాలయానికి తరలించనున్నారు. ఈనెల 15న ఉదయం 10 గంటలకు కవితను కోర్టులో హాజరు పర్చాలని న్యాయమూర్తి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మద్యం విధానంలో కీలక సూత్రధారి, పాత్రధారి కవితే అని సీబీఐ వాదించింది. విచారణకు ఆమె సహకరించడంలేదని, అందుకే కస్డడీకి ఇవ్వాలని కోరుతున్నట్లు కోర్టుకు విన్నవించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని