TTD: ఈనెల 19న శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల

తితిదే షెడ్యూల్‌ ప్రకారం శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల కోటాను విడుదల చేస్తోంది. ఇందులో భాగంగా సెప్టెంబరు నెల కోటాను జూన్‌ 19న విడుదల చేయనుంది.

Updated : 16 Jun 2023 16:13 IST

తిరుమల: తితిదే షెడ్యూల్‌ ప్రకారం శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల కోటాను విడుదల చేస్తోంది. ఇందులో భాగంగా సెప్టెంబరు నెల కోటాను జూన్‌ 19న విడుదల చేయనుంది. భక్తులు https://tirupatibalaji.ap.gov.in వెబ్ సైట్ లో టికెట్లు బుక్‌ చేసుకోవచ్చని తితిదే తెలిపింది. సెప్టెంబరు నెలకు సంబంధించిన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టాదళ పాదపద్మారాధన ఆర్జిత సేవల ఆన్‌లైన్‌ లక్కీ డిప్‌ కోసం జూన్‌ 19న ఉదయం 10గంటల నుంచి 21వ తేదీ ఉదయం 10గంటల వరకు నమోదు చేసుకోవచ్చు. లక్కీడిప్‌లో టికెట్లు పొందిన భక్తులు సొమ్ము చెల్లించి వాటిని ఖరారుచేసుకోవాల్సి ఉంటుంది.

కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్‌ సేవ, సహస్రదీపాలంకరణ సేవ టికెట్లను జూన్‌ 22న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. సెప్టెంబరు నెల కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్‌ సేవ, సహస్రదీపాలంకరణ సేవ వర్చువల్‌ సేవల కోటాను, వాటికి సంబంధించిన దర్శన టికెట్ల కోటాను జూన్‌ 22న మధ్యాహ్నం 3గంటలకు విడుదల చేస్తారు. సెప్టెంబరు నెల అంగ ప్రదక్షిణం టోకెన్ల కోటాను జూన్‌ 23న ఉదయం 10గంటలకు విడుదల చేస్తారు. 

జూన్‌ 22న శ్రీవారి పవిత్రోత్సవాల సేవాటికెట్లు విడుదల

తిరుమల శ్రీవారి ఆలయంలో ఆగస్టు 27 నుంచి 29వ తేదీ వరకు జరుగనున్న పవిత్రోత్సవాల సేవా టికెట్ల కోటాను జూన్ 22న ఉదయం 10 గంటలకు తితిదే ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. భక్తులు ఈ విషయాలను గమనించి సేవా టికెట్లను బుక్ చేసుకోవాలని తితిదే అధికారులు విజ్ఞప్తి చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని