Warangal: నిలిచిపోయిన కాగజ్‌నగర్‌, నవజీవన్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు .. ప్రయాణికుల ఆందోళన

హనుమకొండ జిల్లా కమలాపూర్‌ మండలం ఉప్పల్‌ రైల్వే స్టేషన్‌లో ఆదివారం సాయంత్రం రెండు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. 

Published : 19 May 2024 20:51 IST

కమలాపూర్‌: హనుమకొండ జిల్లా కమలాపూర్‌ మండలం ఉప్పల్‌ రైల్వే స్టేషన్‌లో ఆదివారం సాయంత్రం రెండు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. సిర్పూర్‌ కాగజ్‌ నగర్‌ నుంచి సికింద్రాబాద్ వస్తున్న కాగజ్‌నగర్‌ ఎక్స్‌ప్రెస్‌ను ఉప్పల్‌ స్టేషన్‌లో సాయంత్రం 6.10గంటలకు నిలిపివేశారు. ఆ తర్వాత అహ్మదాబాద్‌ నుంచి చెన్నై సెంట్రల్‌ వెళ్తోన్న నవజీన్‌ ఎక్స్‌ప్రెస్‌ను నిలిపివేశారు. నవజీవన్‌ ఎక్స్‌ప్రెస్‌ రైల్లో ఇంజిన్‌లో సాంకేతికలోపం కారణంగా నిలిపివేసినట్టు అధికారులు తెలిపారు. కాగజ్‌నగర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఇంజిన్‌ను నవజీవన్‌ ఎక్స్‌ప్రెస్‌కు మార్చిన అనంతరం రాత్రి 8గంటలు దాటిన తర్వాత రెండు రైళ్లు బయల్దేరాయి. రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణికులు స్టేషన్‌ మాస్టర్‌తో వాగ్వాదానికి దిగారు. దాదాపు రెండు గంటలకు పైగా రైళ్లు నిలిచిపోవడంతో వృద్ధులు, చిన్న పిల్లలు ఇబ్బంది పడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని