Kanakamedala: సీఎస్‌ని తొలగించి సీబీఐ విచారణ జరిపించండి: ఈసీకి కనకమేడల లేఖ

ఏపీ సీఎస్‌ జవహర్‌రెడ్డి తన అధికారాలను, యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారని, ఆయన్ను తొలగించి సీబీఐ విచారణ జరపించాలని తెదేపా నేత కనకమేడల రవీంద్ర కుమార్‌ ఎన్నికల సంఘాన్ని కోరారు.

Updated : 27 May 2024 20:12 IST

అమరావతి: ఏపీ సీఎస్‌ జవహర్‌రెడ్డి తన అధికారాలను, యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారని, ఆయన్ను తొలగించి సీబీఐ విచారణ జరిపించాలని తెదేపా నేత కనకమేడల రవీంద్ర కుమార్‌ ఎన్నికల సంఘాన్ని కోరారు. ఈ మేరకు ఆయన కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌కు లేఖ రాశారు. ‘‘సీఎస్‌ జవహర్‌రెడ్డి ఎన్నికల నియమావళి ఉల్లంఘించారు. ప్రభుత్వ అసైన్డ్‌ భూముల్ని తన కుమారుడు, బినామీల పేరిట పెద్ద ఎత్తున కొనుగోలు చేశారు. బినామీల ద్వారా 800 ఎకరాలు కొన్నారు. భూముల రిజిస్ట్రేషన్‌ కోసం అధికారులను ప్రభావితం చేస్తున్నారు. కౌంటింగ్‌ సజావుగా సాగడంపై విపక్ష పార్టీలకు అనుమానం ఉంది. ఓట్ల లెక్కింపుపై ప్రభావితం చూపే ప్రమాదం ఉంది’’ అని లేఖలో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని