MLC Kavitha: కవిత ఈడీ కస్టడీ మూడు రోజుల పొడిగింపు..

వారం రోజుల కస్టడీ ముగియడంతో ఎమ్మెల్సీ కవితను రౌజ్‌ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టులో ఈడీ హాజరు పరిచింది.

Updated : 23 Mar 2024 13:25 IST

దిల్లీ: వారం రోజుల కస్టడీ ముగియడంతో ఎమ్మెల్సీ కవితను రౌజ్‌ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టులో ఈడీ హాజరుపరిచింది. ఆమెను మరో 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని దర్యాప్తు అధికారులు కోర్టును కోరారు. కేసు దర్యాప్తు పురోగతిని ఈడీ న్యాయవాది కోర్టుకు వివరించారు. మరికొందరితో కలిపి ఆమెను ప్రశ్నించాల్సి ఉందని పేర్కొన్నారు. కవిత కుటుంబసభ్యుల వ్యాపార లావాదేవీలపై విచారణ జరుపుతున్నామని తెలిపారు. కవితకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని.. వైద్యులు సూచించిన ఆహారాన్నే ఇస్తున్నామని వెల్లడించారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు కవిత కస్టడీని మరో మూడు రోజులు పొడిగిస్తూ తీర్పు వెలువరించింది. ఈ నెల 26 వరకు ఆమె ఈడీ కస్టడీలో ఉండనున్నారు.

కోర్టులోకి వెళ్లే ముందు ఆమె మీడియాతో మాట్లాడారు. తన అరెస్టు అక్రమమని.. న్యాయపోరాటం చేస్తానని పేర్కొన్నారు. మరోవైపు సీబీఐ కోర్టులో బెయిల్‌ పిటిషన్‌ను కవిత తరఫు న్యాయవాది దాఖలు చేశారు. వెంటనే ఈడీకి నోటీసులు ఇవ్వాలని కోరారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని