MLC Kavitha: కవిత మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా

దిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన భారాస ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌పై విచారణ ఏప్రిల్‌ 4కు వాయిదా పడింది.

Published : 01 Apr 2024 16:02 IST

దిల్లీ: దిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన భారాస ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌పై విచారణ ఏప్రిల్‌ 4కు వాయిదా పడింది. తన కుమారుడి పరీక్షల దృష్ట్యా ఈ నెల 16 వరకు బెయిల్‌ మంజూరు చేయాలని మార్చి 26న ఆమె రౌస్‌ అవెన్యూ న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. కవిత పిటిషన్‌పై సమాధానం చెప్పాలని న్యాయస్థానం ఈడీకి నోటీసులు జారీ చేస్తూ.. విచారణను వాయిదా వేసింది. గత నెల 15న హైదరాబాద్‌లోని తన నివాసంలో కవితను ఈడీ అరెస్టు చేసి మరుసటి రోజు రౌస్‌ అవెన్యూ కోర్టులో హాజరుపరిచిన సంగతి తెలిసిందే.

ముందుగా ఈడీ 10 రోజుల కస్టడీకి కోరగా.. న్యాయస్థానం ఏడు రోజులకు అనుమతి ఇచ్చింది. అనంతరం మరో ఐదు రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరగా.. మూడు రోజులకు అనుమతించింది. ఈడీ కస్టడీ మార్చి 26న ముగియడంతో.. అదే రోజు కోర్టులో దర్యాప్తు సంస్థ అధికారులు ఆమెను హాజరు పరిచారు. ఆ తర్వాత కవితకు 14 రోజుల జ్యుడిషియల్‌ రిమాండ్‌ విధించడంతో తిహాడ్‌ జైలుకు తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు