MLC Kavitha: కవిత జ్యుడీషియల్‌ రిమాండ్‌ మళ్లీ పొడిగింపు

భారాస ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్‌ రిమాండ్‌ను దిల్లీలోని ప్రత్యేక కోర్టు పొడిగించింది.

Updated : 20 May 2024 16:20 IST

దిల్లీ: దిల్లీ మద్యం విధానానికి సంబంధించి సీబీఐ కేసులో భారాస ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్‌ కస్టడీని న్యాయస్థానం పొడిగించింది. జూన్‌ 3 వరకు రిమాండ్‌ను పొడిగిస్తూ రౌస్‌ అవెన్యూ కోర్టు జడ్జి కావేరి బవేజా ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల మే 20వరకు పొడిగించిన రిమాండ్‌ గడువు నేటితో ముగియడంతో అధికారులు తాజాగా కోర్టులో హాజరు పరచగా.. రిమాండ్‌ను పొడిగిస్తూ ఆదేశాలు ఇచ్చారు.

ఈడీ కేసులోనూ కస్టడీ పొడిగింపు

ఈడీ కేసులోనూ కవితకు జ్యుడీషియల్‌ కస్టడీని పొడిగిస్తూ రౌస్‌ అవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో ఈడీ దాఖలు చేసిన చార్జిషీటుపై కోర్టులో వాదనలు జరిగాయి. కవిత సహా నలుగురు వ్యక్తులు దామోదర్‌, ప్రిన్స్‌ కుమార్‌, అరవింద్‌సింగ్‌, చరణ్‌ప్రీత్‌పై చార్జిషీటు దాఖలు చేశామని, వారి పాత్రపై ఆధారాలను పొందుపరిచామని ఈడీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. కవిత జ్యుడీషియల్‌ కస్టడీని పొడిగించాలని వాదించారు. కాగా.. చార్జిషీటు దాఖలు చేసిన తర్వాత కస్టడీ అవసరం లేదని, విడుదల చేయాలని కవిత తరఫు న్యాయవాది కోర్టును కోరారు. ఇరువురి వాదనలు విన్న తర్వాత జ్యుడీషియల్‌ కస్టడీని జూన్‌ 3 వరకు పొడిగిస్తూ కోర్టు ఆదేశాలిచ్చింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు