MLC Kavitha: సుప్రీంకోర్టులో రిట్‌ పిటిషన్‌ను వెనక్కి తీసుకున్న కవిత

దిల్లీ మద్యం కేసులో అరెస్టయిన కవిత.. సుప్రీంకోర్టులో వేసిన రిట్‌ పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారు. ఈడీ సమన్లు ఇవ్వడాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను ఆమె ఉపసంహరించుకున్నారు.

Updated : 19 Mar 2024 11:21 IST

దిల్లీ: దిల్లీ మద్యం కేసులో అరెస్టయిన కవిత.. సుప్రీంకోర్టులో వేసిన రిట్‌ పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారు. ఈడీ సమన్లు ఇవ్వడాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను ఆమె ఉపసంహరించుకున్నారు. ఈ కేసులో ఇప్పటికే ఈడీ అరెస్టు చేసిన నేపథ్యంలో.. రిట్‌ పిటిషన్‌పై విచారణ అవసరం లేనందున వెనక్కి తీసుకుంటున్నామని కవిత తరఫు సీనియర్‌ న్యాయవాది విక్రమ్‌ చౌదరి వెల్లడించారు. దీనికి జస్టిస్‌ బేలా త్రివేది, జస్టిస్‌ పంకజ్‌ మిత్తల్‌ ధర్మాసనం అనుమతించింది. తాము చట్ట ప్రకారం ఉపశమనం పొందేందుకు తదుపరి చర్యలకు వెళ్తామని న్యాయవాది తెలిపారు. ఈడీ జారీ చేసిన సమన్లను సవాలు చేస్తూ.. గత ఏడాది మార్చి 14న సుప్రీంకోర్టులో కవిత ఈ పిటిషన్‌ దాఖలు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని