MLC Kavitha: ‘నన్ను అక్రమంగా అరెస్టు చేశారు’.. సుప్రీంకోర్టులో కవిత పిటిషన్‌

దిల్లీ మద్యం కేసులో అరెస్టయిన భారాస ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

Updated : 18 Mar 2024 13:13 IST

దిల్లీ:  దిల్లీ మద్యం కేసులో అరెస్టయిన భారాస ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. సర్వోన్నత న్యాయస్థానంలో కేసు విచారణ జరుగుతుండగానే తనను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. గతంలో విచారణ సందర్భంగా సమన్లు జారీ చేయబోమని కోర్టుకు చెప్పి అక్రమంగా అరెస్టు చేశారన్నారు. కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లుగా భావించి దర్యాప్తు సంస్థపై తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కవిత తరఫు న్యాయవాది నేడు ఆన్‌లైన్‌లో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై మంగళవారం కోర్టు విచారణ చేపట్టనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని