AP SI Exam: ఎస్సై రాత పరీక్షపై కీలక అప్‌డేట్‌.. ఫలితాలు ఎప్పుడంటే?

ఏపీలో ఎస్సై ఉద్యోగాల(Ap SI posts) భర్తీకి ప్రిలిమినరీ రాత పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఈ పరీక్ష ప్రిలిమినరీ కీ సోమవారం, ఫలితాలు మరో రెండు వారాల్లో విడుదల చేయనున్నట్టు అధికారులు వెల్లడించారు.

Published : 20 Feb 2023 01:31 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో 411 ఎస్‌ఐ ఉద్యోగాల (SI posts) భర్తీకి ఏపీ పోలీసు నియామక బోర్డు(apslprb) ఈరోజు (ఫిబ్రవరి 19న) రాష్ట్రవ్యాప్తంగా ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు 1,51,243మంది అభ్యర్థులు హాజరైనట్టు అధికారులు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 13 పట్టణాలు/నగరాల్లోని 291 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్ష ప్రశాంతంగా జరిగినట్టు తెలిపారు.

ఈ పరీక్ష ప్రిలిమినరీ ఆన్సర్‌ కీని సోమవారం ఉదయం 11గంటలకు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్టు వెల్లడించారు. అభ్యర్థులు దీన్ని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిపారు. ప్రిలిమినరీ కీకి సంబంధించి ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 23 ఉదయం 11గంటల లోపు SCTSI-PWT@slprb.appolice.gov.inలో తెలియజేయాలని  సూచించారు. ఈ పరీక్షకు సంబంధించిన ఓఎంఆర్‌ షీట్‌ కాపీలతో పాటు ఫలితాలను రెండు వారాల్లో ప్రకటించనున్నట్టు తెలిపారు. ఈ పరీక్ష సజావుగా జరిగేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఈ మేరకు పోలీస్‌ నియామక బోర్డు ఛైర్మన్‌ మనీశ్ కుమార్‌ సిన్హా ఓ ప్రకటన విడుదల చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని