Kids: చిన్నారుల ఏడుపు వెనకున్న సమస్యలేంటో తెలుసా!

పిల్లలకు ఏం అనిపించినా తెలియజేసేందుకు ఉన్న ఏకైక అస్త్రం వాళ్ల ఏడుపు. కానీ ఆ ఏడుపు వెనక ఉన్న ఇబ్బందేంటో ఎలా తెలుసుకోవాలి. పిల్లలకు ఏ ఏ పరిస్థితులు ఎలాంటి ఇబ్బందులకు గురి చేస్తాయో తెలుసుకోండి. 

Updated : 08 Nov 2022 11:22 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పిల్లలకు ఏ మాత్రం అసౌకర్యంగా అనిపించినా తట్టుకోలేరు. వాళ్లకి ఏ సమస్య ఉందో చెప్పలేరు. పిల్లలకు ఉన్న ఏకైక అస్త్రం వాళ్ల ఏడుపే! దీంతో వాళ్లకి ఎలాంటి ఇబ్బంది ఉన్నా ఏడ్చేస్తుంటారు. మరి ఏడుపు వెనక ఉన్న సమస్యేంటో తెలుసుకోవాలంటే ఎలా!

* పిల్లలకు తరచూ కడుపు నొప్పి వస్తుంటుంది. దీనికి కారణాలు అనేకం.

* పిల్లలకు డబ్బా పాలు పడుతున్నారా! అయితే జాగ్రత్తలు తప్పనిసరి అంటున్నారు.. నిపుణులు! కొనేముందు నాణ్యత ప్రమాణాలు చూసుకోవటం ఉత్తమం. 

* కొంతమంది తల్లులు పిల్లలు ఏడ్చారంటే చాలు.. పాలు పడుతుంటారు. కానీ వాళ్లకు ఇతరత్రా సమస్య ఏదైనా ఉంటే మీరు పాలు పట్టినా ప్రయోజనం ఉండదు. అందువల్ల మొదట బిడ్డ ఏ సమస్యతో బాధ పడుతున్నాడో తెలుసుకోవాలి.  

* పిల్లలకు పాలు పట్టిన వెంటనే పడుకోబెట్టడం, ఆడించడం చేయకూడదు. ఇలా చేయడం వల్ల పిల్లలు వాంతులు చేసుకుంటారు. అందువల్ల కాసేపు వాళ్లని భూజాన వేసుకోండి. దీంతో పిల్లలకు పాలు చక్కగా జీర్ణమవుతాయి. 

* పిల్లలకు ప్రశాంతమైన వాతావరణంలో పాలు పట్టాలి. చుట్టూ గొడవలు, అల్లర్లు ఉంటే పిల్లలకు పాలు ఒంటపట్టవట! చుట్టూ గందరగోళ వాతావరణం ఉంటే పిల్లలు భయపడతారు. ఏడుస్తారు. అందువల్ల పిల్లలు సానుకూల వాతావరణంలో పెరిగేలా జాగ్రత్తలు తీసుకోండి.  

* పిల్లలకు నిద్ర వచ్చినా ఏడుస్తుంటారు. వారి పరిస్థితిని గమనించి పడుకోబెట్టాలి.

* పిల్లలకు వాడే దుస్తులు శుభ్రంగా ఉండాలి. ఎప్పటికప్పుడు దుప్పట్లు, టవల్స్‌ మారుస్తూ ఉండాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని