జగన్‌పై రాయి దాడి కేసు.. ఆ ఆరుగురి వివరాలు తెలపాలంటూ కోర్టులో పిటిషన్‌

సీఎం జగన్‌పై రాయి దాడి వ్యవహారంపై విజయవాడ కోర్టులో పిటిషన్‌ దాఖలైంది. పోలీసుల అదుపులో ఉన్న ఆరుగురి వివరాలు తెలపాలంటూ న్యాయవాది సలీం ఈ పిటిషన్‌ వేశారు.

Published : 18 Apr 2024 13:06 IST

విజయవాడ: సీఎం జగన్‌పై రాయి దాడి వ్యవహారంపై విజయవాడ కోర్టులో పిటిషన్‌ దాఖలైంది. పోలీసుల అదుపులో ఉన్న ఆరుగురి వివరాలు తెలపాలంటూ న్యాయవాది సలీం ఈ పిటిషన్‌ వేశారు. న్యాయవాది కమిషనర్‌ను నియమించాలని పేర్కొన్నారు.

ఈ కేసులో అజిత్‌సింగ్‌ నగర్‌లోని వడ్డెర కాలనీకి చెందిన కొంతమంది అనుమానితులు పోలీసులు అదుపులో ఉన్నారు. వారిని రహస్య ప్రాంతాల్లో విచారిస్తున్నట్లు తెలిసింది. ఆచూకీ చెప్పకపోవడంతో వారి కుటుంబసభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైకాపా నాయకుల ప్రోద్బలంతో పోలీసులు తమపై అక్రమంగా కేసులు పెడుతున్నారని బాధితుల కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంకెవరిని ఇరికిస్తారో అనే భయంతో కొందరు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. రెండు, మూడు వీధులు జన సంచారం లేక నిర్మానుష్యంగా మారిపోయాయి. ఈ నేపథ్యంలో పోలీసుల అదుపులో ఉన్న అనుమానితుల వివరాలు తెలపాలంటూ న్యాయవాది సలీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని