Lok Sabha Elections: సార్వత్రిక సమరం.. తుది విడత పోలింగ్‌ ప్రారంభం

సార్వత్రిక సమరంలో తుది విడత పోలింగ్‌ శనివారం ఉదయం ప్రారంభమైంది. ఏడో దశలో భాగంగా 57 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలింగ్‌ కొనసాగుతోంది.

Updated : 01 Jun 2024 07:06 IST

దిల్లీ : సార్వత్రిక సమరంలో తుది విడత పోలింగ్‌ శనివారం ఉదయం ప్రారంభమైంది. ఏడో దశలో భాగంగా 57 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలింగ్‌ కొనసాగుతోంది. ఇందుకోసం ఎన్నికల సంఘం (ఈసీ) అన్ని ఏర్పాట్లూ పూర్తిచేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులు అనురాగ్‌ ఠాకుర్, ఆర్‌.కె.సింగ్, మహేంద్రనాథ్‌ పాండే, పంకజ్‌ చౌధరీ, అనుప్రియా పటేల్‌ సహా పలువురు ప్రముఖులు ఈ విడతలో బరిలో ఉన్నారు. 18వ లోక్‌సభను కొలువుదీర్చేందుకు జరుగుతున్న ఈ సార్వత్రిక ఎన్నికలను ఏడు విడతల్లో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల 4న ఓట్ల లెక్కింపు చేపట్టి, ఫలితాలు వెల్లడించనున్నారు. దేశవ్యాప్తంగా మొత్తం 543 పార్లమెంటరీ నియోజకవర్గాలు ఉండగా.. ఇప్పటివరకు ఆరు దశల్లో 486 సీట్లకు పోలింగ్‌ పూర్తయింది. మరోవైపు- ప్రస్తుత ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు శనివారం సాయంత్రం 6:30 గంటల తర్వాత వెలువడనున్నాయి.

పంజాబ్‌లో అన్ని స్థానాలకూ..

కేంద్రపాలిత ప్రాంతమైన చండీగఢ్‌తోపాటు ఏడు రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న 56 స్థానాలకు చివరి విడతలో భాగంగా ఓటింగ్‌ కొనసాగుతోంది. పంజాబ్‌లో మొత్తం 13 లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్నాయి. వాటన్నింటికీ ఈ దశలోనే పోలింగ్‌ నిర్వహిస్తున్నారు. మాజీ సీఎం చరణ్‌జీత్‌సింగ్‌ చన్నీ, కేంద్ర మాజీమంత్రి హర్‌సిమ్రత్‌కౌర్‌ బాదల్‌ తదితరులు వాటిలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని