Mallareddy: కేసు పెడితే పెట్టుకోండి.. నా స్థలాన్ని కాపాడుకుంటా: మల్లారెడ్డి

సుచిత్ర పరిధిలోని సర్వే నెంబర్‌ 82లో భూవివాదం చోటు చేసుకుంది. మాజీ మంత్రి, భారాస నేత మల్లారెడ్డికి, ఇతరులకు మధ్య భూవివాదం నెలకొంది.

Updated : 18 May 2024 14:37 IST

హైదరాబాద్‌: సుచిత్ర పరిధిలోని సర్వే నెంబర్‌ 82లో భూవివాదం చోటు చేసుకుంది. మాజీ మంత్రి, భారాస నేత మల్లారెడ్డికి, ఇతరులకు మధ్య భూవివాదం నెలకొంది. ఈక్రమంలో తమ భూమిని కబ్జా చేస్తున్నారంటూ మల్లారెడ్డి ఆయన అల్లుడు మల్కాజిగిరి ఎమ్మెల్యే రాజశేఖర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. భూమి చుట్టూ అక్రమంగా ఫెన్సింగ్‌ వేశారని.. దానిని తొలగించాలని అనుచరులను ఆదేశించారు. మరోవైపు పోలీసులు రంగ ప్రవేశం చేసి.. వివాదంలో ఉన్న భూమిలో ఘర్షణకు దిగొద్దని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.

తమ భూమిలో ఫెన్సింగ్‌ వేస్తే చూస్తూ ఎలా ఊరుకున్నారంటూ పోలీసులతో మల్లారెడ్డి వాగ్వాదానికి దిగారు. కేసు పెడితే పెట్టుకోండి.. నా స్థలాన్ని కాపాడుకుంటానంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల ముందే మల్లారెడ్డి అనుచరులు ఫెన్సింగ్‌ను కూల్చివేశారు. రాజశేఖర్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు పేట్‌బషీర్‌బాద్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. గతంలో ఈ భూమి తమదేనంటూ 15 మంది వచ్చారు. 400 గజాల చొప్పున 1.11 ఎకరాల భూమిని కొన్నామన్నారు. కోర్టు కూడా తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని 15 మంది తెలిపారు. స్థలంపై కోర్టు ఆర్డర్‌ ఉన్నందున సామరస్యంగా పరిష్కరించుకోవాలని పోలీసులు ఇరు వర్గాలకు సూచించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని