Viral news: ఆఫీసుకు ఆలస్యమైతే చెప్పడానికి కొత్త సాకు దొరికిందోచ్‌..!

ఆఫీసుకు ఆలస్యం అయిన సందర్భంలో బాస్‌కు చెప్పేందుకు కొత్త సాకు దొరికిందంటున్నారు నెటిజన్లు. ఇంతకీ ఏంటా సాకో చూసేయండి..

Updated : 03 Apr 2024 14:04 IST

Viral news | ఇంటర్నెట్ డెస్క్‌: ఆఫీసుకు ఆలస్యమైనప్పుడు బాస్‌కు సాకులు చెప్పడం ఉద్యోగులకు అలవాటే. బస్‌ మిస్సయ్యాననో.. హాస్పిటల్‌కు వెళ్లొచ్చేసరికి లేట్‌ అయ్యిందనో ఏవేవో కారణాలు చెప్తూ ఉంటారు. కారణం కూడా సహేతుకంగా అనిపిస్తే సరే సరి. లేదంటే బాస్‌ చేతిలో తిట్లు తప్పవు. అలాగని ఆలస్యమైన ప్రతిసారీ రొటీన్‌గా ఇవే సాకులు చెప్పడమూ బోరే. అలాంటి వారికి కొత్త సాకు దొరికిందంటున్నారు నెటిజన్లు. 

ప్రతీక్‌ రాయ్‌ అనే సోషల్‌మీడియా యూజర్‌ తాజాగా ఎక్స్‌ వేదికగా ఓ పోస్ట్‌ పెట్టాడు. తన ఏథర్‌ స్కూటర్‌ సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ మూలంగా తాను ఆలస్యంగా ఆఫీస్‌కు వెళ్లానని పేర్కొంటూ సరదాగా పోస్ట్‌ పెట్టాడు. ఈ పోస్ట్‌ వైరల్‌గా మారింది. కొన్ని గంటల్లోనే దాదాపు 5 లక్షల వ్యూస్‌ సాధించింది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో  కామెంట్లు పెట్టడం మొదలు పెట్టారు.

‘ఆఫీసుకు లేట్‌ అయినప్పుడు బాస్‌కు చెప్పేందుకు కొత్త సాకు దొరికిందోచ్‌’ అంటూ ఓ వ్యక్తి కామెంట్‌ పెట్టాడు. ‘ఇంకా నయం.. రోడ్డు మధ్యలో ఆగి పోలేదు. అదృష్టవంతుడివి భయ్యా!’ అంటూ మరో యూజర్‌ కామెంట్‌ చేశాడు. ‘ఒకవేళ బాస్‌ టెక్‌ సావీ కాకపోతే దీన్ని వివరించడం ఇంకో అతిపెద్ద సమస్య’ అంటూ పేర్కొన్నాడు. ‘విండోస్‌ అప్‌డేట్‌ మూలంగా మీటింగ్‌కు జాయిన్‌ అవ్వలేకపోయా..!  స్కూటర్‌ అప్‌డేట్‌ కారణంగా ఆఫీసుకు రాలేకపోయా!!’’ అంటూ మరో యూజర్‌ ఫన్నీగా పోస్ట్‌ పెట్టారు. ‘ఎందుకొచ్చిన చిక్కులు బ్రో.. హాయిగా పెట్రోల్‌ స్కూటర్‌ కొనుక్కో’ అంటూ మరో యూజర్‌ సలహా ఇచ్చాడు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని