Medaram: మేడారం జాతర.. హుండీల లెక్కింపు ప్రారంభం

మేడారం (Medaram)లో సమ్మక్క, సారలమ్మ మహా జాతర వైభవంగా ముగిసిన సంగతి తెలిసిందే.

Published : 29 Feb 2024 12:28 IST

హనుమకొండ: మేడారం (Medaram)లో సమ్మక్క, సారలమ్మ మహా జాతర వైభవంగా ముగిసిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ, విదేశాల నుంచి భక్తులు తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకున్నారు. పెద్ద ఎత్తున కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ నేపథ్యంలో జాతర హుండీల లెక్కింపు గురువారం ప్రారంభమైంది. హనుమకొండలోని తితిదే కల్యాణ మండపంలో దీనికోసం ఏర్పాట్లు చేశారు. 518 హుండీలను 10 రోజులపాటు లెక్కించనున్నారు. లెక్కింపును అధికారులు పర్యవేక్షిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని