Medaram: మేడారం మహాజాతరలో తొలి ఘట్టం.. గద్దెపైకి చేరుకున్న సారలమ్మ

వనమంతా జనమైన వేళ.. మేడారంలో తొలి ఘట్టం ఆవిష్కృతమైంది. సమ్మక్క కుమార్తె సారలమ్మ మేడారానికి చేరుకుంది.  

Updated : 22 Feb 2024 00:47 IST

మేడారం: మేడారం మహాజాతరలో తొలి ఘట్టం ఆవిష్కృతమైంది. వనమంతా జనమైన వేళ.. ఆ జనం మధ్యకే వచ్చి వనదేవతలు కొలువుదీరారు. డోలు వాయిద్యాల మధ్య కోలాహలంగా.. కన్నెపల్లి నుంచి బయలుదేరిన సమ్మక్క కుమార్తె సారలమ్మ మేడారానికి చేరుకుంది. భక్తుల జయజయధ్వానాల మధ్య సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలపైకి చేరుకున్నారు. ఈ సందర్భంగా సారలమ్మకు మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్‌, ఎస్పీ సాదర స్వాగతం పలికారు. సారలమ్మ రాక నేపథ్యంలో భద్రతా బలగాలు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశాయి. అంతకు ముందు కన్నెపల్లి గ్రామస్థులైన ఆడపడుచులు సారలమ్మ ఆలయాన్ని ముగ్గులతో అందంగా అలంకరించారు. వనదేవతల రాక సందర్భంగా భక్తులతో మేడారం కిటకిటలాడుతోంది. గురువారం సాయంత్రం సమ్మక్క తల్లి గద్దెపైకి చేరుకోనున్నారు. శుక్రవారం వనదేవతలు అందరూ గద్దెలపై నుంచి భక్తులకు దర్శనమివ్వనున్నారు.    


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని