Botsa Satyanarayana: ఉపాధ్యాయులకు బోధన తప్ప మరో పని చెప్పబోం: మంత్రి బొత్స

రాష్ట్రంలో 679 ఎంఈఓ పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.

Published : 19 Jun 2023 15:36 IST

అమరావతి: రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు బోధన తప్ప మరో పని చెప్పబోమని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. విద్యా కానుక కిట్ల పంపిణీ వారంలో పూర్తి చేస్తామని చెప్పారు. ఉపాధ్యాయ సంఘాలతో చర్చల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. విద్యా వ్యవస్థలో మార్పులపై ఉపాధ్యాయ సంఘాలతో చర్చించామని తెలిపారు. ప్రభుత్వ నిర్ణయాలను ఉపాధ్యాయ సంఘాలకు వివరించామన్నారు. 82 వేలకు పైగా ఉపాధ్యాయులు బదిలీలు కోరారని చెప్పారు.

‘‘రాష్ట్రంలో 679 ఎంఈఓ పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించాం. 350 మంది ప్రధానోపాధ్యాయులకు ఎంఈఓలుగా పదోన్నతి కల్పిస్తాం. ప్రస్తుతం 355 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పాఠశాలల్లో రాత్రి వాచ్‌మెన్‌ పోస్టులను ఇప్పటికే భర్తీ చేశాం. 175 ఇంజినీరింగ్‌ ప్రొఫెసర్లతో టీచర్లకు సాంకేతిక పరిజ్ఞానం కల్పిస్తాం. 98 మంది కంటే తక్కువ సంఖ్య ఉన్న పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్లు లేరు. సబ్జెక్టు టీచర్లు లేనిచోట విద్యార్థులను సమీప పాఠశాలల్లో చేర్పించాలి. పది, ఇంటర్‌లో ప్రతిభ కనబరిచినవారికి అభినందన కార్యక్రమాలు నిర్వహిస్తాం. 20వ తేదీన (మంగళవారం) సీఎం చేతుల మీదుగా విజయవాడలో అభినందన కార్యక్రమాలు చేపడుతున్నాం’’ అని బొత్స వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని