పంట నష్టం.. ప్రతి ఎకరాకు రూ.10 - 15 వేల పరిహారం: మంత్రి జూపల్లి

వడగండ్ల వర్షానికి పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి జూపల్లి కృష్ణారావు హామీ ఇచ్చారు.

Updated : 21 Mar 2024 15:44 IST

భిక్కనూరు: వడగండ్ల వర్షానికి పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి జూపల్లి కృష్ణారావు హామీ ఇచ్చారు. కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం అంతంపల్లి, జంగంపల్లి, దోమకొండ మండలం లింగుపల్లి గ్రామాల్లో పొలాలను మంత్రి పరిశీలించారు. వర్షం కారణంగా పంట నష్టం జరిగిన ప్రతి ఎకరాకు రూ.10వేల నుంచి 15వేల వరకు పరిహారం ఇచ్చేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ప్రతి రైతును ఆదుకుంటాం.. అధైర్య పడొద్దని భరోసా కల్పించారు. ఇప్పటికే 58.6 లక్షల మంది రైతులకు రైతు భరోసా సొమ్ము అందిందని, వచ్చే వారం రోజుల్లో మిగిలిన రైతులకు కూడా అందుతుందన్నారు. పదేళ్లు పాలించిన భారాస.. రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ, కాంగ్రెస్‌ నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని